కరిష్మా ‘ప్రేమ్‌ఖైదీ’కి 29 సంవత్సరాలు

బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌, తెలుగు కథానాయకుడు హరీష్‌ కలిసి నటించిన హిందీ చిత్రం ‘ప్రేమ్‌ఖైదీ’. సరిగ్గా 29 సంవత్సరాల కిత్రం అంటే జూన్‌ 21, 1991న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించింది. కరిష్మా కపూర్‌ తొలిసారిగా వెండితెర ప్రవేశం కల్పించింది సురేష్‌ ప్రొడక్షన్స్ సంస్థే. తెలుగులో వచ్చిన ‘ప్రేమఖైదీ’ చిత్రానికి ఈ సినిమా రిమేక్‌. తెలుగులో ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించగా, హిందీలో కె.మురళి మోహనరావు దర్శకత్వం చేపట్టారు. పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. ఇంకా చిత్రంలో పరేష్‌ రావల్‌, దలీప్‌ తహిల్‌, ఆస్రానీ, షఫీ ఇనామ్‌దార్‌, భరత్‌ భూషణ్‌ తదితరులు నటించారు. ఈ చిత్రంతోనే రాజ్‌కపూర్‌ కుటుంబానికి చెందిన ఓ మహిళ కథానాయికగా మారింది. అప్పటి వరకు మగసంతానం మాత్రమే నటనలో ఉండేది. ఈ సినిమాతోనే కరిష్మా కపూర్‌ తన తన సినీరంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో నటించే నాటికి కరిష్మా కపూర్‌ వయసు 16 సంవత్సరాలు. అప్పుడు కథానాయకుడు హరీష్‌ వయసు 15 సంవత్సరాలు కావడం గమనార్హాం. కరిష్మా కపూర్‌ ఈ సినిమా గురించి ట్విట్టర్లో స్పందిస్తూ..‘‘నేను నటించిన ‘ప్రేమ్‌ఖైదీ’ చిత్రానికి అప్పుడే 29 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి నా ధన్యవాదాలు. కష్టించి పనిచేసే తత్వం, లక్ష్యం, దృడమైన సంకల్పం, నిజాయితీ ఉండడం నాకెంతో మేలు చేశాయి. సురేష్‌ ప్రొడక్షన్స్, ప్రేమ్‌ఖైదీ బృందానికి కృతజ్ఞతలు..’’అంటూ పేర్కొంది.

View this post on Instagram

A post shared by KK (@therealkarismakapoor) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.