ప్రియాంక భారతీయతను మరువలేదు

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకొన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె విమానంలో ప్రయాణం చేస్తున్నప్పటి ఫోటో అది. టీషర్ట్ ధరించిన ఆమె మెడలో వజ్రాలతో పొదిగిన నల్లపూసల మంగళ సూత్రాన్ని ధరించింది. దీంతో ఆమె విదేశీయుడిని పెళ్లాడినా భారతీయతను, సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోలేదనే ప్రశంసలు కామెంట్ల రూపంలో వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంగ్లీష్‌ పత్రిక నిక్, ప్రియాంకల మధ్య మనస్పర్థలు తారాస్థాయిలో ఉన్నాయని వీరిద్దరి బంధం నేడో రేపో అన్నట్లుగా ఉందనే వార్తను ప్రచురించింది. ఇప్పుడు ప్రియాంక ఇలా మంగళసూత్రం ధరించడం వారిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవనే విషయాన్ని స్పష్టం చేస్తోందనే కామెంట్లు వస్తున్నాయి. 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.