
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఎక్కడ ఏ కష్టం వచ్చిన వెంటనే చలించిపోతుంది. తనవంతూ సాయం చేయడానికి ఎప్పుడూ ముందుటుంది. తాజాగా దేశంలో రుతుపవనాల కారణంగా బీహార్, అస్సాం రాష్ర్టాల్లో వరదలు సంభవించి ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఈ వరదల నుంచి ప్రజల కోసం ప్రియాంక నిక్ జోనాస్ దంపతులు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా ట్విట్టర్లో స్పందిస్తూ...దేశంలో రుతుపవనాల కారణంగా అనేక ప్రాంతాల్లో పెద్దఎత్తున విపత్తుతో నష్టం కలిగించాయి. నేను జన్మించిన బీహార్ రాష్ర్టం వరదలకు చాలా ఆస్తుల విద్వసం జరిగింది. అలాగే అస్సాం రాష్ర్టంలో అనేకమంది ప్రజలు వరదల కారణంగా ఇళ్లు కొట్టుకుపోయి నిరాశ్రయులు అయ్యారు. ఇలాంటి సమయంలో మనందరి సాయం వారికి అవసరం. ఇప్పటికే నేను కొన్ని సంస్థలతో కలిసి విరాళం ఇచ్చాం. ఇప్పుడు పునరావాస పనుల కోసం మీరు కూడా తగినంత సాయం అందించాలి. ప్రస్తుతం మనందరం కోవిడ్-19తో పోరాడుతుంటే భారత్లోని అస్సాం రాష్ర్టం పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. లక్షణాది మంది జీవితాలు అగమ్యగోచరంగా తయారైయ్యాయి. ఈ వరదలతో వన్యప్రాణుల అభయారాణ్యాల్లో ఒకటైన కజీరంగ నేషనల్ పార్క్ చాలా వరకు పాడైంది. తిరిగి దీన్ని అస్సలు స్థితికి తీసుకొచ్చేందుకు మావంతు సాయంగా విశ్వనీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. మీరు కూడా అస్సాంఫ్లెడ్స్,అస్సాంనీడ్స్ పేరిట సాయం చేయాలంటూ..పేర్కొన్నారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ‘వుయ్ కెన్ బీ హీరోస్, ‘ది మాట్రిక్స్ 4’, బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్తో కలిసి ‘ది వైట్ టైగర్’ చిత్రంలో చేస్తుంది. ఈ చిత్రానికి నిర్మాతగాను వ్యవహరిస్తుంది.