నాకు ఉబ్బసం..మా ఆయనకు డయాబెటిక్‌: ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సినిమాల్లో నటించడంలోనే కాదు సమాజసేవలోనూ ముందుటుంది. ఆ మధ్య బీహార్‌, అస్సాంకు వరదలు వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడి ప్రజల కోసం ప్రియాంక నిక్‌ జోనాస్‌ దంపతులు విరాళం ఇచ్చారు. కోవిడ్‌ 19 సమయంలో ప్రియాంక చోప్రా భర్తతో కలిసి యుఎస్‌లోనే ఎక్కువగా అక్కడే ఉండిపోయింది. తాజాగా తన కుటుంబం - భర్త గురించి మాట్లాడుతూ..‘‘మేం చాలా సురక్షితంగానే ఉన్నాం. ఎందుకంటే నాకు ఉబ్బసం, మా ఆయనకు టైప్‌ 1 డయాబెటిక్, అందుకే చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో నేర్చుకున్నాం. లాక్‌డౌన్‌ అయినా సరే పనిలో మాత్రం విరామం తీసుకోలేదు. ఏదో ఒకరకంగా పనిచేస్తూ ఉన్నాం. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే తిరిగి పనిలోకి రావడం కొంత క్రేజీగా ఉందని’’ తెలిపింది.  ప్రియాంక చోప్రా ప్రస్తుతం ‘వుయ్‌ కెన్‌ బీ హీరోస్‌, ‘ది మాట్రిక్స్ 4’, బాలీవుడ్‌ హీరో రాజ్‌ కుమార్‌ రావ్‌తో కలిసి ‘ది వైట్‌ టైగర్‌’ చిత్రంలో చేస్తుంది. ఈ చిత్రానికి నిర్మాతగాను వ్యవహరిస్తుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.