అమ్మనాన్న ఇద్దరు ఆర్మీలో పనిచేశారు: ప్రియాంక

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి అమెరికాలో ఉంది. మెమోరియల్‌ డే సందర్భంగా సైనిక దుస్తులు ధరించిన తన తల్లితండ్రులు అశోక్‌ చోప్రా, మధు చోప్రాల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ ఫోటోకి తనదైన రీతిలో స్పందిస్తూ...‘‘నా తల్లితండ్రులు ఇద్దరూ భారతసైన్యంలో పనిచేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైనిక కుటుంబాలకు నేను బంధుత్వాన్ని కలిగిఉన్నాను. ఈ రోజు మన స్వేచ్ఛను కాపాడానికి వారి జీవితాలను త్యాగం చేశారు. ఎందరో ప్రాణాలు సైతం కోల్పోయారు. అలాంటి వారిని మనం గుర్తుపెట్టుకోవాలిలని..’’పేర్కొంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ‘వుయ్‌ కెన్‌ బీ హీరోస్‌, ‘ది మాట్రిక్స్ 4’, బాలీవుడ్‌ హీరో రాజ్‌ కుమార్‌ రావ్‌తో కలిసి ‘ది వైట్‌ టైగర్‌’ చిత్రంలో చేస్తుంది. ఈ చిత్రానికి నిర్మాతగాను వ్యవహరిస్తుంది. తాజాగా తన భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి ‘అన్‌ టిల్‌ వుయ్‌ మీట్‌ అగైన్‌’ అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌ వీడియోలో ప్రత్యేక పాత్రలో సందడి చేసింది.

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.