వీకెండ్‌లో చిందేస్తున్న ప్రియాంక చోప్రా!


బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఎప్పుడూ చూసిన తన భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి సందడి చేస్తుంటుంది. కానీ ఈ సారి సీన్‌ రివర్స్ అయింది. తాజాగా ప్రియాంక చోప్రా ఓ హుషారైన పాటకు శ్రుతి కలుపుతూ చిందేస్తుంది. ఆ వీడియోను తన ట్విట్టర్లో పెట్టింది. దానికి... వీకెండ్‌ డ్యాన్స్. మన కోసం ఎప్పుడూ ఏదో కొత్తగా ఉండాలి.. వ్యాఖ్యను జోడించింది. వీడియో చూస్తుంటే ఏదో మేకప్‌ రూమ్‌లా ఉన్నట్టుంది. కరోనా కారణంగా రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న ఇప్పుడు బయటకు వచ్చినట్టుంది. ఇప్పటికే కోవిడ్‌-19 సహాయార్థం తన వంతుగా భర్తతో కలిసి పేదలకు సాయం చేసింది. అంతర్జాతీయంగాను కరోనాపై పోరాటనికి తనవంతూ కృషి చేస్తుంది. గత ఏడాది బాలీవుడ్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ది స్కై ఈజ్‌ పింక్‌లో అదితి చౌదరిగా అలరించింది. ప్రస్తుతం ది మ్యాట్రిక్స్ 4, రామిన్‌ భరణి దర్శకత్వంలో ‘ది వైట్‌ టైగర్‌ చిత్రంలో పీంకీ మేడమ్‌ పాత్రలో నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి నిర్మాత కూడా. తన భర్త నిక్‌ జోనాస్‌ కుటుంబ సభ్యులతో కలిసి వాట్‌ ఏ మ్యాన్‌ గొట్టా డు’ అనే మ్యూజిక్‌ వీడియో చేసింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.