రకుల్‌.. బాగా బిజీ!

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హిందీలో జోరు ప్రదర్శిస్తోంది. అక్కడామె వరుసగా మూడు సినిమాలు చేయబోతోంది. అర్జున్‌ కపూర్‌ కథానాయకుడిగా ఓ చిత్రం, జాన్‌ అబ్రహామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఎటాక్‌’, అమితాబ్‌ - అజయ్‌ దేవగణ్‌ల ‘మేడే’ సినిమాల్లో నటిస్తున్నట్టు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపింది. అటు హిందీలో నటిస్తూనే, ఇటు దక్షిణాదిలోనూ అవకాశాల్ని సొంతం చేసుకొంటోంది. అయితే తెలుగులో నితిన్‌తో కలిసి ‘చెక్‌’, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా తప్ప కొత్త చిత్రాలేవీ ఒప్పుకోలేదట. తమిళంలో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.