‘ముఖ్యమంత్రి’గా రిచా చద్దా!

‘సర్బ్‌జిత్‌’, ‘సెక్షన్‌ 375’లాంటి చిత్రంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నటించి అలరించిన నటి రిచా చద్దా. తాజాగా రిచా, సుభాష్‌ కపూర్‌ దర్శకత్వంలో ‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ అనే చిత్రంలో రాజకీయ నాయకురాలిగా నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌ లక్నోలో జరుపుకుంది. ఈ సందర్భంగా రిచా చద్ధా మాట్లాడుతూ..‘‘ఇలాంటి వైవిధ్యమైన చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పాత్రల్లో నటించడం కొంచెం కష్టమైన, సుభాష్‌ కపూర్‌ చెప్పినట్లు చేయడంతో ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోయింది. ఇప్పటి వరకు చేసిన పాత్రల కంటే ఇందులో నా పాత్ర కొంచెం భిన్నంగా ఉంటుందని’’ చెప్పింది. ఇంకా చిత్రంలో అక్షయ్‌ ఒబెరాయ్, శుభ్రా జ్యోతి, మానవ్‌ కౌల్, సౌరభ్‌ శుక్లా తదితర నటీనటులు ఇందులో నటిస్తున్నారు. చిత్రం ఈ ఏడాది జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిచా ఈ ఏడాది మొదట్లో కంగనా రనౌత్‌తో కలిసి నటించిన చిత్రం ‘పంగా’ చిత్రంలో కంగనా స్నేహితురాలిగా నటించింది. తెలుగు నటి శృంగార తారా షకిలా జీవితాధారంగా వస్తోన్న ‘షకీలా: నాట్‌ ఎ ఫోర్న్‌ స్టార్‌’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.