
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్యపై బాలీవుడ్, సామాజిక మాధ్యమాల్లోనూ చాలా అనుమానాలు రేకిత్తస్తున్నాయి. తాజాగా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇది ముమ్మాటికి బాలీవుడ్‌కి చెందిన మాఫీయా అంటూ కొన్ని ఆధారాలను సైతం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. బాలీవుడ్ నటి సుశాంత్ సింగ్ ప్రేయసి అయినా రియా చక్రవర్తి 15కోట్ల రూపాయలను సుశాంత్ ఖాతా నుంచి బదిలీ చేసుకొందనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్ సింగ్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ రియాపై కేసు కూడా పెట్టారు. దానికి అనుగుణంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఇడి) అడుగుపెట్టింది. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలు రియా చక్రవర్తి ఏం చేసింది అనే దానిపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఆ డబ్బులను రియా తన తల్లి తమ్ముడి ఖాతాలకు 15 కోట్లు బదిలీ అయ్యాయి. ఇందులో సుశాంత్ కలిసి రియా చక్రవర్తి మూడు స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు ముంబై పోలీసుల దర్యాప్తు ప్రకారం రియా ఆమె సోదరుడు షోయిక్లు మూడు స్టార్టప్ కంపెనీలలో డైరక్టర్లుగాను ఉన్నారు. మొత్తం మీద చివరికి ఈ 15 కోట్ల విషయం ఏ తీరాన చేరుతుందో తెలియాలంటే కొన్నాళ్లు పాటు వేచి చూడాల్సిందే.