‘ఆర్.‌ఆర్.‌ఆర్‌’ కోసం గొంతు సవరించనున్నఅలియా!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌.ఆర్‌.ఆర్)‌. ఇందులో అలియా భట్‌ అల్లూరి సీతారామరాజు (రామ్‌చరణ్‌) భార్య (సీత)గా నటిస్తోంది. ఈ చిత్రంలో పాటకు డ్యాన్స్ తో పాటు అలియా స్వయంగా తన గొంతును వినిపించనుందట. అయితే ఈ పాట తెలుగు, తమిళంలో ఉచ్చారణ పలకడం అలియాకు కొంత ఇబ్బందికరమే. అందుకే ఆమె ‘ఆర్.‌ఆర్.‌ఆర్’‌ హిందీ వెర్షన్‌లో మాత్రమే గొంతు విప్పనుందట. మొత్తం మీద అలియా నటించడంతో పాటు - పాట కూడా పాడటం గొప్ప విషయమే అంటున్నారు సినీ జనాలు. అలియా భట్‌ గతంలో ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హైవే’ చిత్రంలో ఓ పాట పాడింది. ‘హంప్టీ శర్మ కి దుల్హనియా’లో చిత్రంలో అలియా ‘‘సంజావన్’’అంటూ‌ ఆలపించిన గీతాన్ని మనం మరచిపోలేం. ప్రస్తుతం ఆమె సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంగూబాయి కతియావాడి’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఒకప్పుడు ముంబయిలోని రెడ్‌ లైట్‌ ఏరియాలో గంగుబాయి అనే మహిళ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ, అక్కడున్న బడాబడా నాయకుల పరిచయాలతో పవర్‌ఫుల్‌ మహిళగా చక్రం తిప్పింది. అయితే చివరి రోజుల్లో ఆమె తన వేశ్య వృత్తిని వదిలేసి.. అక్కడి సెక్స్‌ వర్కర్ల అభ్యున్నతి కోసం పాటుపడి ఎంతో కృష్టి చేసింది. ఎందరో జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఇప్పుడీమె కథతోనే చిత్రం తెరకెక్కుతోంది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.