హిందీ ‘ఆర్‌ఎక్స్‌ 100’.. అలా తారా చేతుల్లోకి పోయిందట!!

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా విడుదలయ్యాక చాలా రోజుల వరకు పాయల్‌ అందరికీ ఇందుగానే గుర్తుండిపోయింది. ఇలా అసలు పేరుతో కన్నా పాత్ర పేరుతో గుర్తింపు తెచ్చుకున్న కొద్దిమంది కథానాయికల్లో ఒకరిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇంతలా ఆమె వారి మనసులపై చెరగని ముద్ర వేయడానికి కారణం.. ఆ పాత్రలో ఆమె కనబర్చిన నటన, మొహమాటం లేకుండా తెరపై ఆమె ఒలికించిన సొగసులే కారణం. అయితే ఈ చిత్రం హిందీలో రీమేక్‌ చేయడానికి ముందు.. ఆ చిత్ర హక్కులు దక్కించుకున్న ప్రముఖ నిర్మాత సాజిద్‌ నదియావాలా పాయల్‌ను పిలిచి మాట్లాడారట. ఇందు పాత్రలో అద్భుతంగా నటించావని ప్రశంసలు కురిపించారట. అయితే అప్పటికి తారా సుతారియాతో ఉన్న కమిట్‌మెంట్‌ కారణంగా హిందీలో ఇందు పాత్రకు ఆమెనే ఎంచుకున్నట్లు చెప్పారట. నేను కూడా ఆ పాత్ర నాకివ్వమని అడగాలనుకోలేదు. ఎలాగూ ఆ పాత్ర మనకు రాసిపెట్టి ఉంటే.. మనం అడగకున్నా అది మన వద్దకే వస్తుందని నమ్ముతా నేను. అందుకే ఆ అవకాశం పోయినందుకు నేను బాధపడలేదు’’ అని చెప్పుకొచ్చింది పాయల్‌. ఈ భామ అక్టోబరు 11న ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.