500 సార్లు చూశా మీరు చూడండి!

బాలీవుడ్‌ బ్యూటీ ‘జవానీ జానేమన్‌’ నటి ఆలయ తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించబోయే చిత్రానికి ఆలయ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. తాజాగా ఆలయ నటించిన ‘జవానీ జానేమన్‌’ ఇప్పుడు డిజిటల్లోనూ విడుదలైంది. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ స్త్రీలోలుడిగా నటించాడు. అనన్య అనే పాత్రలో టబు నటించింది. ఈ చిత్రం గురించి ఆలయ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ ‘‘ఇప్పటికి నేను ‘జవానే జానేమన్‌’ సినిమాని 500 సార్లు చూశాను. ఇప్పుడు మరోసారి ఫ్రైమ్‌వీడియోలో చూడటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు’’ అంది. ఆ వీడియోలో ‘ఒలే ఒలే 2.ఓ’ పాటను చూసి ఆలయ ఎగిరి గంతేసింది. ఆ సన్నివేశాల్లో తను ఎక్కడుందో చూపిస్తూ హంగామా చేసింది. ఆలయ ఎవరో కాదు అలనాటి తార పూజాబేడీ కూతురే.

View this post on Instagram

A post shared by Alaya F (@alaya.f) on





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.