ప్రకృతి ప్రేమలో పడిపోయా: సంగీతా బిజ్లానీ


బాలీవుడ్‌ నటి సంగీత బిజ్లానీ 1990వ దశకంలో ప్రముఖ హిందీ నటిగా అలరించింది. ఆమె నటించిన ‘జుర్మ్, యోధ, నిర్భయ, కన్నడంలో పోలీస్‌ ముత్తు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ జిమ్‌ చేస్తూ ప్రకృతిని ప్రేమిస్తుంది. తాజాగా సంగీత ముగ్దమనోహరమైన అందాన్ని ప్రకృతికే అంకితం అన్నట్లుండే ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఆ ఫోటోకి కొంటెగా తనదైన రీతిలో క్యాప్షెన్‌ కూడా పెట్టింది. అదేమంటే ‘‘హే అబ్బాయిలు ఈఫోటో చూసి నా మానసిక స్థితి ఎంటో చెప్పండి..అంటూ ప్రశ్న సంధించింది. ఇంకో ఫోటోకి తనదైన రీతిలో కవిత్వం కూడా జోడించింది. ‘‘ప్రతి క్షణం నేను భిన్నమైన దృశ్యం ఆవిషృతమౌతోంది. ఆకాశంలో ఎన్నో విభిన్నమైన రంగుల హరివిల్లు ఉన్నాయి. అందమైన రూపాలను సృష్టించే ఈ అంతరిక్ష మేఘాలను నేను చూస్తుండగా, సూర్యాస్తమయంలో ఆయన ఎవరితోనే సరసాలు ఆడుతున్నట్లు నేను గ్రహించాను. మీరు ఇంత అందమైన ప్రపంచాన్ని చూడాలంటే. ముందు మీరు సాంకేతిక పరికరాలు పక్కన పెట్టండి. అప్పుడు మాత్రమే ఈ అందమైన ప్రకృతిలోకి ప్రవేశించగలరు. అప్పుడు మాత్రమే మనసు చేసే మాయాజాలం స్వయంగా అనుభవించగలరంటూ ప్రకృతిపై ప్రేమ కవిత్వాన్ని ఇలా లాక్‌డౌన్‌ కాలంలో అందమైన అనుభవాల్ని వెల్లడించింది. పదహారేళ్లకే మోడల్‌గా ప్రవేశం చేసిన సంగీత 1980లో మిస్‌ ఇండియా యూనివర్స్ టైటిల్ కిరీటాన్ని దక్కించుకుంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో సంగీత భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, అక్కడ ఆమె తల్లి పూనమ్ బిజ్లానీ రూపొందించిన ఉత్తమ జాతీయ వస్త్రధారణ అవార్డును గెలుచుకుంది. 1989 మల్టీస్టారర్‌గా వచ్చిన త్రివేది చిత్రంలో మాధురీ దీక్షిత్‌, సోనమ్‌లతో కలిసి నటించింది. 1996లో ప్రముఖ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ని పెళ్లి చేసుకొంది. 14 సంవత్సరాల పాటు సజావుగా సాగిన వీరి కాపురం 2010లో విడిపోయింది.

View this post on Instagram

A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.