రిక్షా ప్రయాణం... వడా పావ్‌ .. ఇప్పుడు లేవు!!

‘సాహో’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్‌ నాయిక శ్రద్ధాకపూర్‌. హిందీలో అగ్ర కథానాయిక దూసుకుపోతున్న శ్రద్ధ బోలెడంత స్టార్‌డమ్‌ సంపాదించింది. కానీ స్టార్‌ ఇమేజ్‌ వలన చాలా కోల్పోయాను అంటోంది. ‘‘సినిమాల్లోకి రాకముందు ఇంటి నుంచి చాలా స్వేచ్ఛగా మార్కెట్‌కు వెళ్లేదాన్ని. ముంబయి కార్టర్‌ రోడ్‌లో హాయిగా తిరిగేదాన్ని. రిక్షాల్లో ప్రయాణం, స్నేహితులతో కలిసి కాఫీ షాప్‌ వెళ్లడం, సేవ్‌ పూరి, వడా పావ్‌....ఇలా ఎన్నో సరదాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు కుదరడం లేదు’’ అని చెప్పింది శ్రద్ధ.
వసూళ్లు బాగుంటే ఎక్కువమంది చూసినట్టే ‘సాహో’ చిత్రం మంచి వసూళ్లు అందుకున్నా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ‘చిచ్చోరే’ కూడా చిత్రం రూ.150 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ భారీ వసూళ్లే సినిమా విజయానికి ప్రధాన సూచిక అనేది శ్రద్ధ అభిప్రాయం. ‘‘వసూళ్లను బట్టే ఎంతమంది ఆ సినిమాను చూశారనేది తెలిసిపోతుంది. వసూళ్లు బాగున్నాయంటే ఎక్కువమంది సినిమా చూసినట్టే కదా. సినిమా బాగుంది అనే మాటతో పాటు వసూళ్లు చాలా కీలకం’’ అని చెప్పింది శ్రద్ధ.

ఒక్కో పాత్ర...ఒక్కో కొత్త ప్రపంచం శ్రద్ధ నటించిన సినిమాలు చూసుకొంటే ఒకదానికికొకటి భిన్నంగా ఉంటాయి. ఓ పక్క మాస్‌మసాలా సినిమాలు చేస్తూనే మరో పక్క నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలతోనూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం డ్యాన్స్‌ నేపథ్యంగా సాగే ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ’లో వరుణ్‌ధావన్‌తో నటిస్తోంది. ఆమె టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి నటించనున్న ‘బాఘీ 3’ పూరిస్తాయి యాక్షన్‌ చిత్రం. ఇలా డిఫరెంట్‌ జోనర్‌ కథలు ఎంచుకుంటూ వెళ్లడం గురించి శ్రద్ధ మాట్లాడుతూ ‘‘ఓ నటిగా అన్ని రకాల పాత్రలు నటించాల్సిందే. నా అదృష్టం కొద్దీ వైవిధ్యమైన పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఓ కొత్త పాత్ర చేసే అవకాశం దక్కిందంటే నాకో కొత్త ప్రపంచం దొరికినట్టే’’ అని చెప్పింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.