నా వ్యక్తిత్వానికి ముసుగు తొడిగి మోసగించను!!

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తన అభిప్రాయాలను పంచుకోవడం సోనాక్షికి అలవాటు. అదే ఆమెను అభిమానులకు మరింత దగ్గర చేసింది. అయితే అభిమానులతో ముచ్చటించేటప్పుడు తన వాస్తవ వ్యక్తిత్వానికి ముసుగు తొడిగి మోసగించనని, అసలు సిసలైన సోనాక్షిలానే వ్యవహరిస్తానని చెబుతోందామె. ‘‘ఇతరులను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నవారు తమ అసలు వ్యక్తిత్వాన్నే ప్రదర్శించాలి. ఎందుకంటే అబద్ధపు వ్యక్తిత్వాన్ని నటించేవారు జీవితంలో ఎదగలేరు. నాకు, నా అభిమానులకు మధ్య ఉన్న ప్రత్యక్ష అనుబంధమే అసలైన నేను. సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చటిస్తున్నప్పుడు కూడా నేను నాలాగే ఉంటా. అక్కడ నా అభిప్రాయాలనూ నేనే స్వయంగా పోస్ట్‌ చేస్తుంటా. ఏదైనా విషయంపై నాకు పరిజ్ఞానం లేకపోతే దాని గురించి అసలు మాట్లాడను. అంతే తప్ప మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి సమస్యలు కొనితెచ్చుకోను. నాలా నేను ఉండటమే నాకిష్టం’’ అని చెప్పింది సోనాక్షి. అన్నట్లు ఫ్యాషన్‌ విషయంలోనూ సోనాక్షికి నిర్దిష్ట అభిప్రాయాలున్నాయి. ‘‘అమ్మాయిలు సినీ తారల ఫ్యాషన్‌ను అనుసరిస్తుంటారు. అందుకే ఫ్యాషన్‌ విషయంలోనూ వాస్తవికతకు దగ్గరగా ఉండేలా చూసుకుంటా. ప్రత్యేక సందర్భాల్లో తప్ప మిగిలిన సమయాల్లో మేకప్‌కు దూరంగా నాలానే ఉండటానికి ప్రయత్నిస్తా’’ అంది సోనాక్షి. ఆమె ‘ఫ్యాషన్‌ సూపర్‌స్టార్‌’ అనే ఓ రియాలిటీ షోకు న్యానిర్ణేతగా వ్యవహరించనుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.