అప్పుడే తొమ్మిదేళ్లు గడిచాయా!

ఒకప్పటి బాలీవుడ్‌ నటుడు, మాజీ పార్లమెంట్‌ సభ్యుడైన శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. సోనాక్షి వెండితెర కథానాయికగా అరంగేట్రం చేసి అప్పుడే తొమ్మిదేళ్లు నిండిపోయాయి. సల్మాన్‌ఖాన్‌తో ‘దబాంగ్‌’ చిత్రంలో కలిసి నటించింది. సరిగ్గా సెప్టెంబర్‌ 10, 2010న తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా తన సినీ జీవితంలో నవవసంతాలు పూర్తయిన సందర్భంగా సోనాక్షి మాట్లాడతూ..‘‘నేను నమ్మలేక పోతున్నా. నేను చిత్రసీమకి వచ్చి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. నాకైతే నిన్నగాక మొన్న వచ్చినట్లే ఉందని’’ చెబుతోంది. ప్రస్తుతం సోనాక్షి తన మొదటి చిత్రమైన దబాంగ్‌ సీక్వెల్‌గా వస్తున్న ‘దబాంగ్‌3’లో నటిస్తుంది. సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌తో కలసి నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చి రెండువందల కోట్లు వసూళ్లు చేయడంతో సోనాక్షి సిన్హా తన ఆనందాన్ని ట్విట్లర్‌ పంచుకుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.