అది నా వ్యక్తిగతం

విరాళాల గురించి బయటకు చెప్పడం.. ప్రకటించకపోవడం పూర్తిగా తన వ్యక్తిగతం అని బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా అన్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి భారతదేశంలో నానాటికీ విజృంభిస్తోన్న తరుణంలో దాని కట్టడి కోసం ఎంతో శ్రమిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాళాలను ఇవ్వని పలువురు సినీతారలను ట్యాగ్‌ చేస్తూ నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్న వారిలో బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా కూడా ఉన్నారు. దీంతో తన పై వస్తున్న ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చారామె. ‘‘నేను ఎలాంటి విరాళాన్ని ప్రకటించలేదని పలువురు నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్‌పై నేనెంతో మౌనంగా వ్యవహరించాను. మంచి చేయండి కానీ దాని గురించి మర్చిపోండి అనే మంచిమాటను గుర్తుపెట్టుకోండి. మీరు మీ సమయాన్ని నిజమైన మంచి పనులు చేసేందుకు ఉపయోగించండి. విరాళాలను బయటకు ప్రకటించడం లేదా ప్రకటించకపోవడం అనేది పూర్తిగా నా వ్యక్తిగతం' అని సోనాక్షి ట్వీట్‌లో పేర్కొన్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.