మా ప్రేమ ఈఫిల్‌ టవర్‌ అంత ఎత్తు!

బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ మొదట నాన్న కూచిగానే సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు ప్రేమికుల రోజును ఘనంగా జరుకుంది. ఈ సందర్భంగా సోనమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త ఆనంద్‌ అహుజా కలిసి ముద్దుపెట్టుకుంటున్న ఫోటోను పెట్టింది. ‘‘..మేమిద్దరం జులై 2016న మొదటిసారి ఫ్యారిస్‌ సందర్శించాం. అప్పటిదే ఈ ఫొటో. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నేను ఈరోజును మరచిపోలేను..’’ అంటూ పేర్కొంది. ఆ ముద్దు ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. సోనమ్‌ కపూర్, ఆనంద్‌ అహుజాల వివాహం 2018న జరిగింది.

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.