నా జీవితంలో మర్చిపోలేను!

చేసినవి కొన్ని చిత్రాలే కావచ్చు. అవన్నీ సామాజిక అంశాలే చుట్టే తిరుగుతుంటాయి. మరి అలాంటి పాత్రల్లో నటించడానికి మామలుగా ఏ కథానాయికలు ముందుకు రారు. కానీ భూమి ఫెడ్నేకర్‌ మాత్రం ఇలాంటి పాత్రల్నే ఏరికోరి చేస్తుంది. గతంలో ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’, ‘లస్ట్‌ స్టోరీస్‌’లాంటి చిత్రాలు ఆ కోవకు చెందినవే. ఇప్పుడు అలాంటి దమ్మున్న స్త్రీ పాత్రను 'సోన్‌ చిరియా' చిత్రంలో చేస్తుంది భూమి ఫెడ్నేకర్‌. ఆమె నటించిన చిత్రం ఈ చిత్రం.. మార్చి 1, 2019న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా భూమి ఫెడ్నేకర్‌ మాట్లాడుతూ..‘‘ఇప్పుడు నేను చేస్తున్నది మామాలు పాత్ర కాదు. అదొక సాహసంతో కూడిన పాత్ర అని తెలుసు. 1975వ దశకంలో నాటి ఓ బందిపోటు ముఠాలోని పాత్ర అది. పేరు ఇందుమతి. పోలీసులకు బందిపోటు ముఠా మధ్య జరిగిన కథ ఇది. ఈ పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. మొదటి ఆ పాత్ర కోసం దర్శకుడు అభిషేక్‌ చౌబే నన్ను సంప్రదించినప్పుడు నాకు ఒకింత భయమేసింది. అయినా ఇలాంటి పాత్రలు చేస్తేనే కదా ఒక ఆర్టిస్ట్‌ సత్తా తెలిసేది. అందుకనే నేను ఒప్పుకున్నా. అయితే ఆ పాత్ర ఏంటి దాని రూపురేఖలు అనే విషయాల గురించి అడిగాను. అప్పట్లో బుందేల్‌ఖండ్‌ కొండ ప్రాంతాల్లో ఎలాంటి మాండలిక పదాలు ఎలా పలుకుతారు, వారి వేషభాషలాంటి అన్నింటి పూర్తిగా తెలుసుకున్నా. అలా ఆ పాత్రలోకి ప్రవేశించా. నేను ఎక్కువగా ఒక మామూలు స్త్రీ పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే అలాంటి వారిలో మార్పుతెచ్చేది ఇలాంటి దమ్మున్న పాత్రలే. అందుకే డిగ్లామరైజ్‌ పాత్రలైనా నేను చాలా ఇష్టంగా చేస్తాను’’అంటోంది. ఆర్‌.ఎస్‌.వి.పి.మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్‌ చౌబే దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా చిత్రంలో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్, మనోజ్‌ బాజ్‌పేయి, అశుతోష్‌ రాణా తదితరులు నటిస్తున్నారు. విశాల్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రొన్నీ స్క్ర్వీవాలా నిర్మాత.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.