ఈ గణేష్‌ చతుర్థి.. సన్నీకి ఎంతో ప్రత్యేకం!

ఒకప్పటి నీలిచిత్రాల సుందరి, నేటి బాలీవుడ్‌ స్టార్‌ కథానాయిక సన్నీలియోనీ.. ఏం చేసినా, ఏం మాట్లాడినా అందులో తనదైన మార్కు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం తన జీవితగాథ ఆధారంగా రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘కరణ్‌జిత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నిలియోనీ’తో సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా సన్నీలియోనీ తన కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. గణేష్‌ చతుర్థి నాడు తన భర్త డేనియల్‌ వెబర్‌తో కలిసి ఎంతో ఆనందంగా నూతన గృహంలోకి అడుగుపెట్టినట్లు ట్విట్టర్‌ వేదికగా అభిమానులకు తెలియజేసింది. దీనికి సంబంధించి ఓ వీడియోనూ పోస్ట్‌ చేసింది. ‘‘నాకు సంప్రదాయాలు.. అన్నీ రూల్స్‌ తెలియవు. ముఖ్యంగా ఈరోజు కచ్చితంగా ఏం పని చేయాలో కూడా తెలియదు. కానీ నేను వెబర్‌ మాత్రం గణేష్‌ చతుర్థిని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టి జరుపుకుంటున్నాం. అందరికీ గణేష్‌ చతుర్థి శుభాకాంక్షలు. గాడ్‌ బ్లెస్‌ యు ఆల్‌’’ అని ఆ వీడియోకు ఓ వ్యాఖ్యను జత చేసింది. ఈ వీడియోలో వెబర్‌ సన్నీని ఎత్తుకొని నూతన గృహంలోకి తీసుకువెళ్లాడు. అంతేకాదు వీడియో చివర్లో సన్నీ తనదైన స్టైల్‌లో వెబర్‌కు ఓ ఘాటైన లిప్‌లాక్‌ ఇవ్వడం ఆకట్టుకుంది. అయితే దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలొస్తున్నాయి. పండగ రోజు పబ్లిక్‌గా ఈ ముద్దులేంటి అంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.