అడిసన్ వ్యాధితో బాధపడ్డా: సుస్మితా సేన్

మాజీ అందాల సుందరి సుందరి సుస్మితాసేన్‌ అంటే మనకు అర్జున్‌ నటించిన ‘ఒకేఒక్కడు’ చిత్రం గుర్తుకొస్తుంది. ఆ చిత్రంలో ‘షకలక బేబీ షకలక బేయిబే లుక్కలివ్వ తోచలేదా.. స్ర్తీలంటే నీకే ద్వేషమా నువ్వు ఇరవై ఏళ్ల ముసలాడివా’’ అంటూ ఈ పాటతో సుస్మితా సేన్‌ యువత గుండెల్లో సెగలు పుట్టించింది. అలాంటి అందాల తార సెప్టెంబర్‌ 2014 నుంచి అడిసన్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తాజాగా ఈ వ్యాధి గురించి ఆమె మాట్లాడుతూ..‘‘నాలుగు సంవత్సరాలు చాలా బాధపడ్డాను. స్టెరాయిడ్లుకు ప్రత్యామ్నాయంగా కార్టిసాల్‌ వాడాను అయితే అవి చాలా నష్టాన్ని మిగిల్చాయి. కానీ ఎంతటికి నయం కాకపోవడంతో మార్షల్‌ ఆర్ట్స్ ‘నుంచక్’‌తో శరీరాన్ని అనుసంధానం చేశాను. దాంతో నుంచక్‌తో ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ప్రస్తుతం నాలో నిజమైన శక్తి వచ్చింది. స్టెరాయిడ్లుకు స్వస్తి పలికాను. ఈ బాధ నుంచి బయటపడేందుకు నా గురువు నుపూర్‌ శిఖారేకు ధన్యవాదాలు చెప్పాలని పేర్కొంది. అంతేకాదు అందరికి ధన్యవాదాలు శాంతి శాంతి శాంతి ..దుగ్గ దుగ్గ అంటూ’’ వీడియోలో తన వ్యాధి గురించి చెప్పింది. సుస్మితా సేన్  - రేనా, అలిషా అనే ఇద్దరు అమ్మాల్ని దత్తత  తీసుకుంది. వారికి సంబంధించిన పూర్తి బాధ్యతలను తనే తీసుకుంది. ప్రస్తుతం 3 ఏళ్ల అందాల సుందరి తనకంటే 15ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌ను కొంతకాలంగా ప్రేమలో ఉంది. తరుచూ వీరికి సంబంధించిన ప్రేమ వ్యవహారాలను సామాజిక మాధ్యమాల్లో పెడతూ సందడి చేస్తుంది సుస్మిత.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.