న్యాయం కోసమే నా పోరాటం

మోడల్, నటి తనుశ్రీ దత్తా గత ఏడాది బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. అందులో భాగంగా ముంబై పోలీస్‌లు విచారణ చేపట్టారు. నానా పటేకర్‌ - తనుశ్రీని ఇబ్బంది పెట్టింది 2008 సంవత్సరంలో ‘ఓకే హార్నర్‌ ప్లీజ్‌’ చిత్రీకరణ సమయంలో. ఆ సినిమాలో దత్తా ఓ ప్రత్యేక గీతంలో నటించింది. ఆ రోజు షూటింగ్‌ జరిగిన సమయంలో ఉన్న పదిహేను మందిని పోలీసులు విచారించారు. అయితే వారిలో ఎవరూ నానాకు వ్యతిరేకంగా చెప్పలేదు. ఆ విషయాన్నే పోలీసులు తనుశ్రీకి చెప్పారు. దీనిపై తనుశ్రీ స్పందిస్తూ...‘‘మీరు విచారించిన ఆ పదిహేను మంది ఎవరు? వాళ్లు ఎవరి దగ్గర పనిచేశారు? వారు నా స్నేహితులా? లేక పటేకర్‌ సన్నిహితులా... ముందు తేల్చాలి. కచ్చితంగా మీరు విచారించిన వాళ్లంతా ఆయనకు తెలిసినవారే. కాబట్టి ఇలాంటి వారికి శిక్ష పడటానికి సాక్ష్యాలు లేకపోవచ్చు. ఏ రోజుకైనా న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉంది. నేను నా ఒక్కదాని కోసమే బయటికి రాలేదు. అన్యాయాలు జరుగుతున్నా.. బయటకు చెప్పలేని ఏంతో మంది అబలలు ఉన్నారు. వారందరి కోసం నా పోరాటాన్ని తుది వరకు కొనసాగిస్తాను’’ అంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.