నాకు నటన రాదా?

సామాజిక మాధ్యమంలో ఆనందం పంచుకోవాలనుకున్న నటి తాప్సీకి చేదు అనుభవం ఎదురైంది. తాను త్వరలో దర్శకుడు అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా.. ్ఞఅనుభవ్‌ సార్, తాప్సీకి నటన తెలీదు. వేరే హీరోయిన్‌ను మీ సినిమాకు తీసుకోండ్ఠి అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘సారీ, ఈ సినిమాకు సంతకం పెట్టేశాను. ఇప్పుడు నన్ను తీసేయడం కుదరదు. తర్వాత చిత్రానికి సంతకం చేసే సమయంలో ప్రయత్నించ్ఠని ఘాటుగా సమాధానం ఇచ్చింది తాప్సీ. సినిమా ప్రారంభానికి ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏ హీరోయిన్‌కు మాత్రం అసంతృప్తి ఉండదు?.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.