మనకిదే సరైన సమయం!

‘‘సినిమాల్లో నటించేందుకు మహిళలకు ఇప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చిందని చెబతోంది..’’ బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నూతన నటి తారా సుతారియా. ఈమధ్యనే తెరపైకి వచ్చిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2’ చిత్రంలో టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి మృదుల పాత్రలో అలరించింది తారా. ‘‘గతంలో కంటే ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో కథానాయకులకు సమానంగా మహిళా పాత్రలకు అంతే ప్రాధాన్యతే లభిస్తుంది. ఇలాంటి మంచి అవకాశాలు, ఉత్సాహం ఉన్న రంగం ఒక్కటే. అదే చిత్రసీమ. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ అన్నట్టు.. సినీమాల్లో చాలా అవకాశాలే ఉన్నాయి. వాటిని అంది పుచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని’’ చెబుతోంది తారా. 2010 ‘బిగ్‌ బడా బూమ్‌’ టెలివిజన్‌ షో ద్వారా బుల్లితెరపైకొచ్చిన తారా ‘బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ నిక్కి’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మిలాప్‌ జవేరి దర్శకత్వం వహిస్తున్న ‘మార్జావాన్‌’ సినిమాలో సిద్దార్థ మల్హోత్రాతో కలిసి జంటగా నటిస్తుంది. అక్టోబర్‌ 2, 2019న ఈ చిత్రం తెరపైకి రానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.