పెళ్లి చేసుకోనున్న తార సుతారియా!


బాలీవుడ్‌ అందాల సుందరి తారా సుతారియా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్’‌ చిత్రంతో బాలీవుడ్‌లో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ అమ్మడు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పీకల్లోతు ప్రేమలోనూ మునిగిపోయింది. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ బంధువు అయిన ఆదార్‌ జైన్‌తో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. తాజాగా నీతూ కపూర్‌ ఓ కొరియా గ్రాఫర్‌తో కలిసి డ్యాన్స్ ట్రాక్‌ రిహార్సల్‌ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. అయితే అందరూ తన కుమారుడు రణ్‌బీర్‌ కపూర్‌ - అలియా భట్‌ల పెళ్లి కోసం ఇలా డ్యాన్స్ ప్రాక్టిస్‌ చేస్తుందని అనుకున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే తారా సుతారియా - ఆదార్‌ జైన్‌ల పెళ్లి కోసమే ఈ డ్యాన్స్ రిహార్సల్‌ చేసినట్లు వీడియో చూస్తే అర్థం అవుతోందని అంటున్నారు. అదార్‌ జైన్‌ తల్లి రిమా జైన్‌ వీరి ప్రేమపై స్పందిస్తూ..‘‘మా అబ్బాయి ప్రేమించే ఎవరినైనా మేం కూడా ప్రేమిస్తాం’’ అని చెప్పింది. మొత్తం మీద ఇక మీదట ఆలస్యం చేయకుండా తొందరగా పెళ్లి చేసుకోవాలని అదార్‌ - తార సుతారియాలు అనుకొన్నారట. గత ఏడాది కిందట అమితాబ్‌ బచ్చన్‌ ఇంట జరిగిన దీపావళి వేడుకలకు తారా - ఆదార్‌లు కలిసి వచ్చి సందడి చేశారు. ఆ సమయంలో తార అందమైన సిల్వర్‌ షిమ్మరీ చీరతో చాలా అందంగా కనిపించి అక్కడున్న వారందరి దృష్టిని తనపైకి తిప్పుకుంది. 2019లో తార ‘మార్జవాన్‌’ చిత్రంలో సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి నటించింది. ప్రస్తుతం తార, మిలాన్‌ లుథ్రియా దర్శకత్వంలో ‘తడాప్’‌ చిత్రంలో జయంతి అనే పాత్రలో నటిస్తోంది. సునీల్‌ శెట్టి తనయుడు అహన్ శెట్టి కథానాయకుడు. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్, నదియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌ సంస్థలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. తెలుగులో కార్తికేయ గుమ్మకొండ నటించిన ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రానికి ఇది రీమేక్‌ సినిమా.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.