సోదరితో కలిసి పార్సి వంటకాన్ని నేర్చుకుంటున్నా: తారా సుతారియా

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన అందాల నటి తారా సుతారియా. గత ఏడాది మార్జవాన్‌ చిత్రంలో అలరించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ అమ్మడు సినిమాల్లో పాటలు పాడేందుకు ఆసక్తి కనబరుస్తుందట. అందుకే ఇంట్లోనే పాత పాటలు వింటూ సంగీతం నేర్చుకుంటుందట. అంతేకాదు ‘సంగీతం వింటూ టీ తాగుతుంటే ఆ మజాయే వేరని’ చెబుతోంది. ఈ సందర్భంగా సుతారియా మాట్లాడుతూ..‘‘ నేను ఏకాంతంగా గడపడానికి చాలా ఇష్టపడతాను. నా కుటుంబంతో గడపడం చాలా ఇష్టం. ప్రస్తుతం నా కవల సోదరి (పియా)తో కలిసి పార్సి వంటకం గురించి తెలుసుకుంటున్నా. మా అమ్మ చాలా అద్బుతంగా వంట చేస్తుంది. వారి నుంచి నేను సల్లి బోటి అనే ముఖ్యమైన పార్సి వంటకాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. అంతేకాదు పంజాబి వంటకాలుపై ప్రయోగం చేశాను. ఇటీవల జంగ్లీ మటన్‌, చోలే వండాను. త్వరలోనే సినిమా షూటింగ్‌ వెళ్లాలని ఉంది. కానీ అది ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా. అంతేకాదు స్నేహితులతో కలిసి బయట భోజనం చేసే రోజు కోసం కూడా ఎదురుచూస్తున్నానని.. చెబుతోంది. ప్రస్తుతం మిలాన్‌ లుథారియా దర్శకత్వంలో తడాప్‌ చిత్రంలో నటిస్తుంది. ఇందులో సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్నాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.