రెండేళ్లుగా రోహ్మాన్‌ ప్రేమలో సుస్మితాసేన్‌

సుస్మితాసేన్‌ భారతదేశం నుంచి మిస్‌ యూనివర్స్ టైటిల్‌ గెలుచుకున్న తొలిభారతీయ మహిళ. గత రెండేళ్లుగా తన కంటే చిన్నవాడైన ప్రియుడు రోహ్మోన్‌ షాల్‌తో ప్రేమలో మునిగితేలుతుంది. తాజాగా ఈ అమ్మడు ప్రియుడుతో కలిసి రేండేళ్ల ప్రేమ పరిచయంలో సామాజిక మాధ్యమాల్లో అతనితో కలిసి దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘‘నిన్ను నేను కలిసినప్పుడు. హ్యాపీ యానివర్సిరీ జాన్‌. మన రెండు సంవత్సరాల సమైక్యత, నా ఆశీర్వాదాలు లెక్కలేనన్ని. బేబీ ఐ లవ్‌ యు..’’ అంటూ ట్విట్టర్లో పేర్కొంది. సుస్మితా ఈ మధ్య నటించిన వెబ్‌సీరీస్‌ చిత్రం ‘ఆర్య’. సుస్మితా సుమారు పదేళ్ల తరువాత హిందీ‌లో నటించింది. రాష్‌ మాధవానీ, సందీప్‌ మోడీ, వినోద్‌ రావత్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సీరీస్‌ చిత్రం డీస్నీఫ్లస్ హాట్‌ స్టార్లో విడుదలై ప్రేక్షకుల మెప్పుపొందింది. ఈ సినిమాలో సుస్మితా సేన్‌ నటన చూసిన తరువాత చాలామంది ప్రముఖులు ఆమె నటను మెచ్చుకున్నారు. సుస్మితా సేన్   రేనా - అలిషా అనే ఇద్దరు అమ్మాల్ని దత్తత తీసుకుంది. వారికి సంబంధించిన పూర్తి బాధ్యతలను తనే తీసుకుంది. ప్రస్తుతం అందాల సుందరి సుస్మిత తనకంటే 15ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌ను కొంతకాలంగా ప్రేమలో ఉంది. తరుచూ వీరికి సంబంధించిన ప్రేమ వ్యవహారాలను సామాజిక మాధ్యమాల్లో పెడతూ సందడి చేస్తుంది.

View this post on Instagram

A post shared by Sushmita Sen (@sushmitasen47) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.