‘ఐస్లాడోస్‌’ చిత్రంలో నటించడం గర్వంగా ఉంది: ఊర్వశి

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతౌలా బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పుపొందుతోంది. అయితే తాజాగా ఈ భామ అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభ నేపథ్యంలో స్పానిష్‌-ఇంగ్లీష్‌ మిని డాక్యుమెంటరీగా వచ్చిన ‘ఐస్లాడోస్‌’ అనే చిత్రంలో నటించింది. లూసిటో కొమునికా, జవాన్సా జురిటా కలిసి సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాని మీనీ-డాక్యుమెంటరీ యూట్యూబ్‌ ఒరిజినల్స్‌లో స్పానిష్‌ - ఇంగ్లీష్‌లో దాదాపు ముఫ్పై దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ..‘‘ఐస్లాడోస్‌’ పేరుతో అంతర్జాతీయంగా నేను నటించిన మొదటి చిత్రం ఇది. భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నటిని నేనను. ఏషియా నుంచి ప్రాతినిధ్యం వహించిన నటిని నేనే. నాకెంతో గర్వంగా ఉంది. అంతర్జాతీయ తారాగణంతో కలిసి పనిచేయాలనే నాకోరిక నెరవేరింది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న వాస్తవ విరుద్ధమైన నిజాలను ఇందులో చూపించారు. ఇలాంటి కష్టసమయాల్లో యావత్‌ మానవజాతి ఎలా ఉండాలో మనకు చిత్రంలో చెబుతోందని..వివరించింది. ఊర్వశి ప్రసుత్తం వర్జిన్‌ భానుప్రియ అనే చిత్రంలో నటించింది. ఇది త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఇందులో గౌతమ్‌ గులాటి, రాజివ్‌ గుప్తా, అనెజా వాలియాలు నటిస్తున్నారు. ఊర్వశి ఇన్‌స్టాగ్రామ్‌లో 26.3 మిలియన్లు ఫాలోవర్స్‌ ఉండగా, ట్విట్టర్లో 63 లక్షలపైగా అభిమానులను సంపాదించింది. 2015లో 21 ఏళ్ల వయసులో మిస్‌ యూనివర్స్‌గా 80 మందిలో ఒకరిగా పోటీపడింది. అయినా కిరీటం దక్కలేదు. ఆ తరువాత బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.