వాణీ కపూర్‌పై నెటిజన్ల ఆగ్రహం

తెలుగు హీరో నానితో కలిసి ‘ఆహా కల్యాణం’లో సందడి చేసిన కథానాయిక వాణీ కపూర్‌. ప్రస్తుతం వాణీ ఓ వివాదంలో చిక్కుకుని నెటిజన్ల ఆగ్రహానికి గురౌతోంది. వాణీ ‘హే రామ్‌’ అంటూ రాసిన టాప్‌ జాకెట్‌ బికిని ధరించిన ఫోటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అది చూసిన నెటిజన్లు చాలా తీవ్రమైన పదాలతో వాణీపై విరుచుకుపడుతన్నారు. ఆ ఫోటో ఎప్పుడు ఎక్కడ తీసిందో మాత్రం తెలియదు. వాణీ తన ట్విట్టర్‌ స్టేటస్‌లో పెట్టుకుంది. కానీ ట్విట్టర్లో తొలిగించినా కూడా ఈ ఫోటోతో వాణీకి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఉంది. సరదా, ప్యాషన్‌ కోసం వేసుకొన్న డ్రెస్‌ కారణంగా వాణీ కపూర్‌కి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్‌ చేస్తూ..‘‘మీకు మతం మీద నమ్మకం లేకపోయినా, సంస్కృతి, సంప్రదాయలను గౌరవించక పోయినా ఫర్వాలేదు. కానీ ఇలాంటి డ్రెస్‌లు వేసుకొని మా మనోభావాలతో ఆడుకోవద్దంటూ’’ ఘాటుగా హెచ్చరిస్తూ.. అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాణీ ఈమధ్యనే హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌లతో కలిసి ‘వార్‌’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం కరణ్‌ మల్హోత్రా దర్శకత్వంలో వస్తున్న ‘షమ్‌షేరా’లో వాణీ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇది 1800 శతాబ్దానికి చెందిన బ్రిటీష్‌ వారిని ఎదిరించే బందిపోటు తెగకు చెందిన యదార్థ కథ.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.