కరోనాకు కృతజ్ఞతలు తెలిపిన విద్యాబాలన్‌!

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వైరస్‌ గురించి హడలిపోతుంది. బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ మాత్రం కరోనా చాలా మంచి పనిచేసిందని ప్రశంసింది. అందుకు కారణమేమిటో విద్యా బాలన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియాలో ఏముందంటే..‘‘నిత్యం బిజీగా వాహన కాలుష్యంతో నిండివున్న రద్దీని తగ్గించింది. చెట్లు, ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మమ్మల్ని కదిలించినందుకు, మేం చాలా పెద్దదానిపై ఆధారపడి ఉన్నామని తెలిపినందుకు ధన్యవాదాలు. ఎంతో విలాసంగా జీవించే మాకు ఉత్పత్తులు, స్వేచ్ఛ లాంటి వాటి నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నాం. మనకు ఇష్టమైన ఎన్నో ప్రాధమిక అవసరాలను పక్కన పెట్టి బిజినెస్‌ అంటూ తిరగడం. నీవల్ల అవన్నీ తెలిసి వచ్చాయి. మేం ఏం కోల్పోయాం అనే విషయాన్ని కరోనా వైరస్‌ వల్లే తెలిసింది. గతంలో ప్రపంచ పర్యావరణానికి ఎంతో హాని చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రపంచమంతా నీవల్ల ఇప్పుడు కలుస్తుంది. నీవల్ల మాలో ఐక్యత పెరిగింది. ప్రపంచ ఇప్పుడు మారిపోతుంది. ఎప్పుడూ ఓకేలా ఉండదు అని నిరూపించావు అంటూ’’ కరోనాకు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం విద్యాబాలన్‌ గణితమేధావి అయిన శకుంతలా దేవి జీవితాధారంగా వస్తున్న చిత్రంలో నటిస్తుంది. అను మేనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో సాన్య మల్హోత్రా, స్పందన్‌ చతుర్వేది తదితరులు నటిస్తున్నారు. అబున్‌దాంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రం మే 8, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.