ఆ స్టార్‌ అలాంటి స్టోర్‌ చూడలేదంటా!

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు రిషి కపూర్‌ ఓ షూ స్టోర్‌ని చూసి ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్వీట్‌ చేశారు. ఇటీవలే ఆయన న్యూయార్క్‌ వెళ్లగా అక్కడున్న ఓ స్నికర్‌ స్టోర్‌ని సందర్శించారట. అందులో దాదాపు 12,000 రకాల మోడల్స్‌ని చూసి షాక్‌ అయ్యారట రిషి. తానింత వరకు ఇలాంటి స్టోర్‌ని చూడలేదని, ఇన్ని వేల మోడల్స్‌ను ఓకే చోట చూడటం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. వాటి ధరలు కూడా చాలా తక్కువగా.. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయని, కావాలంటే మీరూ జూమ్‌ చేసి చూడండి అంటూ ఓ పోస్ట్‌ పెట్టారు. రిషి ప్రస్తుతం ‘జూటా కహిన్‌ కా’ చిత్రంలో నటిస్తున్నారు. జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.