సర్‌ప్రైజ్‌గా ఆమీర్‌ ఎకానమీ ప్రయాణం

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఉన్న కొద్దిమంది బాలీవుడ్‌ సినీ ప్రముఖుల్లో ఆమీర్‌ ఖాన్‌ ఒకరు. తాజాగా ఈ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ తనదైన సింప్లిసిటీతో అందరి దృష్టినీ ఆకర్షించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే.. బిజినెస్‌ క్లాస్‌లలోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అరుదుగా మాత్రమే ఎకానమీ క్లాస్‌ల్లో దర్శనమిస్తుంటారు. తాజాగా ఇండిగోకు చెందిన విమాన ప్రయాణికులకు ఊహించిన సర్‌ప్రైజ్‌ అందింది. ఎందుకంటే ఆమీర్‌ ఖాన్‌ ఆ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ఓ సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణం చేశారు. ఇంతటి స్టార్‌ హీరో ఓ మామూలు వ్యక్తిలా విండో సీటులో కూర్చొని వెళ్లడం అక్కడి వారందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. నెటిజన్లు ఆమీర్‌ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈయన ‘లాల్‌ సింగ్‌ చద్దా’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.