ఆమె ఇష్టానికే వదిలేశా: ఆమీర్‌ ఖాన్‌

ఆమీర్‌ ఖాన్‌ ముద్దుల తనయ ఇరా జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరా ఆరేళ్ల వయస్సున్న ఫోటోను షేర్‌ చేశారు. ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ ‘‘నేను ‘మంగళ్‌ పాండే’ సినిమాలో నటిస్తున్నప్పుడు నీ వయస్సు 6 సంవత్సరాలు. అప్పుడే నువ్వు 21 వసంతాలు పూర్తి చేశావు. చాలా తొందరగా ఎదిగిపోయావు’’ అని రాశారు. గతంలో ఓ ముఖాముఖిలో ఇరా సినిమాల్లో నటిస్తుందా ఆనే ప్రశ్నకు సమాధానంగా ‘‘ఆమె ఇష్టానికే అన్నీ వదిలేశా. ఆమె ఏం ఆలోచిసోం్తదో తెలియదు. ఫిలిం మేకింగ్‌ అంటే ఇష్టం ఉందనకుంటాను’’ అని ఆమీర్‌ సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా ఇరా తన స్నేహితుడు ఖాన్‌తో జన్మదినం సందర్భంగా సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. ఫోటోపై ‘ఎవెంజర్‌్్స’ సినిమాలోని ‘లవ్యూ 3000 టైమ్స్‌’ అనే డైలాగ్‌ రాసి ఉంది. ఆమీర్‌ ఖాన్‌ తాజాగా నటిస్తున్న సినిమా ‘లాల్‌ సింగ్‌ చద్దా’ 2020 క్రిస్మస్‌ నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

View this post on Instagram

Happy 21st @khan.ira !!! Can't believe you got there so fast! You will always remain 6 for me! Love you. Papa.

A post shared by Aamir Khan (@_aamirkhan) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.