‘గే’ పాత్రలో ఆయుష్మాన్‌
                              

బాలీవుడ్‌ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానా ‘గే’గా నటించనున్నారు. 2017 సంవత్సరంలో విడుదలైన ‘శుభ్‌ మంగల్‌ జ్యాదా సావధాన్‌’ ఆయుష్మాన్‌ నటించాడు. వైవిధ్య, కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో పెళ్లైయిన ఓ అబ్బాయి తన భార్యతో ఎలా ప్రవర్తించేవాడు. అతను ఎదుర్కొన్న సమస్యలపై హాస్యభరితంగా తెరకెక్కిన చిత్రమే ఇది. ఇందులో భూమి ఫెడ్నేకర్‌ కథానాయిక. ఆర్‌.ఎస్‌.ప్రసన్న దర్శకత్వంలో రూపొందిన సినిమాకి ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ నిర్మాత. ప్రస్తుతం ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ నిర్మాణంలో ‘శుభ్‌ మంగల్‌’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు హితేష్‌ కేవల్య దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయుష్‌ మాట్లాడుతూ..‘‘ఇదొక ప్రత్యేకమైన పాత్ర. హోమోసెక్సుల్‌ అనేది చాలా సున్నితమైన అంశం. ఈ విషయాన్ని వినోధభరితంగా తెలియజెప్పడమనేది కత్తిమీద సాములాంటిది’’ అంటున్నారు. చిత్రం ఆగస్టు చివరిలో వారంలో ప్లోర్‌ మీదకు వెళ్లనుంది.                
                 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.