ఐశ్వర్య చాలాఉద్వేగంగా స్పందించింది: అభిషేక్‌ బచ్చన్‌


ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌, నిత్యమేనన్‌ కలిసి నటిస్తోన్న వెబ్‌సీరీస్‌ చిత్రం ‘బ్రీత్‌: ఇన్‌టూ ది షాడోస్‌’. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ విడుదలై ప్రతి ఒక్కరిని కదిలించిందింది. ఈ సినిమాని చూడటానికి బచ్చన్‌ కుటుంబ సభ్యులు కూడా చాలా ఉద్వేగంతో ఉన్నారట. తాజాగా ఈ సినిమా గురించి అభిషేక్‌ బచ్చన్‌ మాట్లాడుతూ..‘‘మా కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడ్డానికి చాలా ఆత్రుతగా ఉన్నారు. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్‌ మానసికంగా చాలా ఉద్వేగంతో ఎదురు చూస్తోంది. ఈ చిత్రం అందరిని కట్టిపడేస్తుంది. నా వరకు మా ఇంట్లో వాళ్లు ట్రైలర్లో నా పాత్రను చూసి చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఇక సినిమాని ఎప్పుడెప్పుడా చూద్దామని వేచి ఉన్నారు. ఇది నాకు సవాలుతో కూడిన పాత్ర. నేను బాగా ఇష్టపడి చేసిన కష్టమైన పాత్ర. కచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని..’’ చెప్పారు. అభిషేక్‌ బచ్చన్‌ ఇందులో ఓ మానసిక వైద్యుడిగా నటించారు. చిత్రంలో అతని కూమార్తెను కొంతమంది కిడ్నాప్‌‌ చేస్తారు. దాంతో మూడునెలల పాటు పాపతో ఎటువంటి మాటలు వినలేకపోతాడు. ఇంకా అమిత్‌ సాధ్‌ దర్యాప్తు చేస్తున్న అధికారి పాత్రలో నటించారు. సైకాలిజికల్‌ థ్ర్లిల్లర్‌ నేపథ్యంతో నిత్యమేనన్‌ తొలిసారిగా వెబ్‌ సీరీస్‌లో నటిస్తున్న చిత్రం ఇది. మాయాంక్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నిత్యమేనన్‌ అభిషేక్‌ బచ్చన్‌ భార్యగా నటిస్తోంది. అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణంలో రూపొందిన చిత్రంలో సయామి ఖేర్ కూడా ఓ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం జులై 10న అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వా‍రా విడుదల అయ్యింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.