బాలీవుడ్‌ నటుడు అఫ్తాబ్‌ శివదాసానికి కరోనా పాజిటివ్‌


ఇప్పుడు ప్రపంచంలో కరోనా కేసుల్లో భారత్‌ రెండవ స్థానానికి చేరుకుంది. దేశంలోని కరోనా రోగుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అన్‌లాక్‌ 4.0లో భాగంగా దాదాపుగా అన్ని రంగాలకు చెందిన పరిశ్రమలు అనుమతి ఇవ్వడంతో జనాలు బయటకు వస్తున్నారు. అందులో భాగంగా చిత్రసీమకు చెందిన ప్రముఖులు సైతం షూటింగ్‌ల కోసం బయటకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు అఫ్తాబ్‌ శివదాసాని కోవిడ్‌ 19 పరీక్ష చేయించుగా ఫలితం సానూకూలంగా రావడంతో ఆయనకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్లోనే స్వీయనిర్భందంలోకి వెళ్లారు. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంటూ..మీరందరూ ఆరోగ్యంగా, బాగుంటారని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నా. ఇటీవల నేను పొడి దగ్గు, తేలికపాటి జ్వరంతో కరోనా లక్షణాలు చూపించడం ప్రారంభిచాయి. వెంటనే కోవిడ్‌ 19 పరీక్ష చేయించుకోగా, దురదృష్టవశాత్తు ఫలితం అనుకూలంగా వచ్చింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో నేను ఇంట్లోనే స్వీయనిర్భందంలోకి వెళ్లాను. అందుకే ఇప్పటికే నన్ను సంప్రదించినవారంతా సురక్షితంగా ఉంటారని భావిస్తూ, మీరు కూడా పరీక్షచేయించుకోవాలని అభ్యర్తిసున్నా. మీ మద్దతు, ఆశిస్సులతో నేను త్వరలోనే కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటాను. సామాజిక దూరం పాటించడం, మాస్కులు, శానిటైజర్‌ని సాధ్యమైనంత వరకు ఉపయోగించడం మంచిది. మనందరం దీనిని కలిసి గెలుస్తాం. మీ శివదాసాని అంటూ పేర్కొన్నారు. బాలీవుడ్‌లో అఫ్తాబ్‌ ప్యార్‌ ఇష్క్ ఔర్ మెహబ్బత్‌, అవారా పాగల్‌ దీవానా, ప్యాసా, ఫుట్‌పాత్‌, స్పీడ్‌, దస్ కహానియన్, గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రాల్లో నటించారు.

View this post on Instagram

A post shared by Aftab Shivdasani (@aftabshivdasani) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.