అజయ్‌ని ఆదిపురుష్‌ బృందం సంప్రదించలేదట


రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఆదిపురుష్‌. ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించగా, ప్రతినాయకుడు రావణుడి పాత్రలో పటౌడీ సైఫ్ అలీఖాన్‌ నటిస్తున్నారు. ఇక శివుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా అజయ్ దేవగణ్‌ శివుడి పాత్ర గురించి అజయ్‌ బృదం స్పందిస్తూ..ఆదిపురుష్‌ చిత్రంలో నటించమని ఇప్పటి వరకు అజయ్‌ని కలవలేదు. కానీ మీడియాలో మాత్రం రకారకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికైనా పూర్తి సమాచారం తెలుసుకోవాలంటూ కోరింది. ఇక మరోవైపు చిత్రంలో సీత పాత్ర కోసం ఇప్పటికే బాలీవుడ్ కథానాయికలైన అనుష్క శర్మ, కియారా అడ్వాణీ, క్రితి సనన్‌ పేర్లతో పాటు దక్షిణాది నటి అనుష్క శెట్టి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి సమాచారం అందడం లేదు. ఆదిపురుష్‌ చిత్రాన్ని రెట్రోఫిల్స్ ప్రొడక్షన్ సమర్పణలో టి-సిరీస్ నిర్మిస్తున్నాయి. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ముందుగా తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించి తరువాత తమిళ,కన్నడ, మలయాళంలో చిత్రాన్ని డబ్బింగ్‌ చేసి విడుదల చేయనున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.