పుకార్లు నమ్మకండి!

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి కరోనా వైరస్‌. దీని భారిన పడి ఎంతోమంది మరణించగా, సుమారు ఆరులక్షల మందికిపైగా పాజిటీవ్‌ ఉంది. తాజాగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ భార్య కాజోల్, కూతురు నైషాకు కరోనా వల్ల అనారోగ్యంగా ఉన్నారని, కరోనా పరీక్షల్లో పాజిటీవ్‌ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన నటుడు అజయ్‌ దేవగణ్‌..‘‘అందరూ అనుకుంటున్నట్లు నా భార్య (కాజోల్‌) కూతరు (నైషా)లు క్షేమంగా ఉన్నారు. వారికి ఎలాంటి రోగాలు లేవు. నైషా సింగపూర్‌ నుంచి వచ్చిన తరువాత స్వీయ నిర్భందలోనే ఉన్నారు. మేమందరం ప్రధాని చెప్పినట్లుగానే లాక్‌డౌన్‌ని పాటిస్తున్నాం’’ అని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఇక కాజోల్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్వులు చిందిస్తున్న ఫోటోను కూడా పోస్ట్‌ చేసింది. మొత్తం మీద కరోనాపై కొన్ని అవాస్తవ సంఘటనలు, వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.
View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.