‘భారతీయుడు2’లో అజయ్‌ ప్రవేశం!

విభిన్నమైన కథలను వైవిధ్యంగా తెరకెక్కించే దర్శకుడు శంకర్‌. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘భారతీయుడు2’. చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నటించనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రాబోయో కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌లో, అజయ్‌ ప్రవేశించనున్నాడని సమాచారం. మొత్తం మీద సేనాపతికి ఎదురుపడే ప్రతినాయకుడు ఎవరో తెలిసిపోయింది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ తారాగణమే నటిస్తుండం విశేషం. కమల్‌హాసన్‌ సరసన అమృతవల్లిగా కాజల్‌ వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. ఇంకా చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు నటిస్తున్నారు. చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.