అతిథి పాత్రలో అక్షయ్‌ కుమార్‌

కథానాయకుడుగా పలు చిత్రాలతో బిజీగా ఉండే అక్షయ్‌ కుమార్‌ ఓ చిత్రంలో అతిథి పాత్ర చేయబోతున్నారు. తెలుగులో విజయవంతమైన ‘భాగమతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘దుర్గావతి’గా రూపొందుతుంది. మాతృకలో తెరకెక్కించిన దర్శకుడు అశోక్‌ బాలీవుడ్‌లోనూ తన ప్రతిభ చూపబోతున్నారు. అనుష్క పాత్రలో భూమి ఫెడ్నేకర్‌ నటిస్తుంది. ఈ చిత్రంలోనే అక్షయ్‌ కుమార్‌ అతిథి పాత్ర పోషిస్తున్నారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆయన ఎలాంటి క్యారెక్టర్‌ చేస్తున్నారో స్పష్టత లేదు. వరుస సినిమాలతో బిజీ బిజీ ఉన్న అక్షయ్‌ ఈ సినిమా కోసం అతిథిగా మారతాడా? అంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. టీ-సిరీస్‌, కేఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ , అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.