యువతకు అక్షయ్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ ఏంటి?

ఐస్‌ బకెట్‌, కికీ ఛాలెంజ్ ఛాలెంజ్‌ అంటూ యువతను ఆకర్షించిన సోషల్‌ మీడియా ప్రస్తుతం బాటిల్‌క్యాప్‌ ఛాలెంజ్‌కు తెరతీసింది. కాలితో బాటిల్‌ మూత తీయడం ఈ ఛాలెంజ్‌ ఉద్దేశం. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు దీన్ని అనుసరిస్తుంటారు. ప్రస్తుతం బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఈ తరహా వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్షయ్‌ కాలితో బాటిల్‌ మూత తీయడంతో నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన రావడమే కాదండోయ్‌ సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయింది. ‘నేను నా ఫైట్‌ మాస్టర్‌ నుంచి స్ఫూర్తి పొందాను, మీరూ చేయండి.. మీరు చేసిన వీడియోల్లో నాకు బాగా నచ్చిన వాటిని రీట్వీట్‌ చేస్తాన’ని యువతకు ఛాలెంజ్‌ విసిరాడు అక్షయ్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.