2020 ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న అక్షయ్‌కుమార్‌

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అదే విధంగా విపత్తు సమయంలోనూ తన విశాల హృదయంతో బాధలో ఉన్నవారికి ఓదార్పుతో పాటు విరాళం ఇవ్వడంలోనూ ముందుంటారు. అలాంటి అక్షయ్‌ కుమార్‌ తాజాగా ఫోర్బ్స్ 2020 టాప్‌ 100 జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీనటుడు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలు, సంగీత దర్శకులు, క్రీడాకారులు, రచయితలు, హాస్యనటులు ఉంటారు. వీరందరిలో 52వ స్థానం  అక్షయ్‌ కుమార్‌ సంపాదించడం చాలా గర్వంగా ఉందని చెప్పుకోవచ్చు.

View this post on Instagram
A post shared by Forbes (@forbes) on


హాలీవుడ్ నటులైన విల్‌స్మిత్‌, జెన్నీఫర్‌ లోపెజ్‌లాంటి నటులను దాటుకొని 48.5 మిలియన్ల డాలర్ల సంపాదనతో ముందున్నాడు. అక్షయ్‌కుమార్‌ హీరోగానే కాకుండా చిత్రనిర్మాణ సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. అంతేకాదు అనేక వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసీడర్‌గాను వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది రెండవ స్థానం సంపాదించుకున్న హాలీవుడ్‌ నటి కైలీ జెన్నర్‌ ఇప్పుడు 590 మిలియన్‌ డాలర్ల సంపాదనతో మొదటి స్థానం దక్కించుకుంది. ఆ తరువాతి స్థానంలో తన దగ్గర బంధువైన కాన్యే వెస్ట్ 170 మిలియన్లతో తరువాతి స్థానంలో చోటు దక్కించకున్నాడు. అక్షయ్‌కుమార్‌ ప్రస్తుతం ‘పృథ్వీరాజ్‌’ చిత్రంలో చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ‘లక్ష్మీబాంబ్’‌, ‘సూర్యవన్షి’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు ఓటీటీ ద్వారా లేక థియేటర్లో విడుదల చేస్తారనే విషయంపై పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.







Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.