పోలీస్‌ ఫౌండేషన్‌కు అక్షయ్‌ భారీ విరాళం!

కరోనా మహ్మరిపై పోరాటానికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తాజాగా ఆయన ముంబై పోలీస్‌ ఫౌండేషన్‌కి రెండు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇదే విషయాన్ని ముంబైపోలీస్‌ కమీషనర్‌ తన అధికారిక ట్విట్టర్‌ వేదికగా అక్షయ్‌ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి. ముంబై పోలీసు ఫోర్స్‌ కరోనా కట్టడిలో చాలా బాగా కృషి చేస్తుంది. ఇప్పటికే అక్షయ్‌ కరోనా మహమ్మారిని పారద్రోలటానికి వ్యక్తిగత రక్షణ సామాగ్రితో (పిపిఇ-కిట్స్‌) పాటు, కరోనా పరీక్ష నిర్ధారణను వేగవంతం చేయడం కోసం బీఎమ్‌సీకి (ముంబై మునిసిపల్‌ కార్పోరేషన్‌) 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. మొదట్లోనే కరోనాపై పోరాటానికి పీఎమ్‌-కేర్స ఫండ్‌కి సాయం చేశాడు. మొత్తం మీద ‘కేసరి’ చిత్ర నటుడు అక్షయ్‌ కుమార్‌ దేశంలో ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించే నటుడిగా పేరుంది. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ ‘సూర్యవన్షి’, ‘లక్ష్మీబాంబ్‌’, ‘పృథ్వీరాజ్‌’లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ‘సూర్యవన్షి’ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రం వాయిదా పడింది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.