సినీ కార్మికుల కోసం 45 లక్షలు విరాళం ప్రకటించిన అక్షయ్‌కుమార్‌

కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్నీ రంగాలు దెబ్బతిన్నాయి. అందులో ముఖ్యంగా చిత్రసీమతో పాటు బుల్లితెర రోజు వారి కార్మికులకు కష్టాలు మొదలైయ్యాయి. నటుడు అక్షయ్‌ కుమార్‌ వీరి కోసం 45 లక్షల రూపాయలు సహాయం చేశాడు. ఈ మొత్తాన్ని ఆయన సినీ మరియు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (సింటా)కు అందజేశారు. అక్షయ్‌ ఇప్పటికే తనవంతు పీఎమ్‌ కేర్స్ ఫండ్‌ కూడా సాయం చేశారు. ఇక ముంబైకి చెందిన పోలీసుల కోసం 2 కోట్ల రూపాయలు, అంతేకాదు పీపీఇ కిట్ల కోసం ముంబై మునిపల్‌ కోఆపరేషన్‌ వారికి 3 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఇలా అక్షయ్‌కుమార్‌ కరోనా కష్ట కాలంలో చాలా వరకు తనవంతుగా సాయం చేస్తూనే ఉన్నారు. అక్షయ్‌కుమార్‌కి దేశసైనికులంటే ఎంతో అభిమానం గతంలో ఆర్మీ యుద్దవీరులకు సైతం నగదు సాయం చేశాడు. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ సూర్యవన్షి అనే చిత్రంలో చేస్తున్నాడు. ఇందులో కత్రీనా కైఫ్‌ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు లారెన్స్ దర్శకత్వంలో ‘లక్ష్మీబాంబ్‌ చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో త్వరలోనే ఓటీటీ ద్వారా విడుదల కానుందని సమాచారం.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.