‘అల వైకుంఠపురములో’ సల్మాన్‌?

ల వైకుంఠపురములో’ సల్మాన్‌ ఖాన్‌ ఏంటి అనుకుంటున్నారా? సినిమా చూశాం, మాకు ఎక్కడ కనిపించలేదు అని సందేహ పడుతున్నారా. విషయం ఏంటంటే.. సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అల్లు అర్జున్‌ కథానాయకుడుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మాటలు, పాటలతో మ్యాజిక్‌ చేసిన ఈ సినిమాను హిందీ ప్రేక్షకులకు రుచి చూపించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయట. బన్నీ పాత్రను సల్మాన్‌ పోషించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సల్మాన్‌ కూడా ఈ రీమేక్‌లో నటించేందుకు ఇష్టంగా ఉన్నాడని తెలుస్తోంది. సుశాంత్‌ పాత్ర కోసం మరో కథానాయకుడ్ని వెతికే పనిలో ఉన్నారని టాక్‌. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి బాలీవుడ్‌ మీడియా చెప్పుకొస్తుంది. దర్శకుడు, ఇతర తారాగణం ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.