అమీర్‌ఖాన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌

బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్ సిబ్బందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయ్యింది. ఇదే విషయాన్ని అమీర్‌ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. వెంటనే స్పందించిన ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు అమీర్‌ ధన్యవాదాలు తెలిపారు. వైరస్ సోకిన వారందరిని క్వారంటైన్‌కి పంపిపారట. దేశంలో రోజురోజుకు కరోనా ప్రమాదకర స్థాయికి చేరుకొంటోంది. ముఖ్యంగా ముంబై మరింత ప్రమాదపు అంచుల్లో ఉందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం కరోనాకి పేద-ధనిక, సామాన్యుడు- సెలబ్రెటీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇక పోతే అమీర్‌ఖాన్‌ తన కుటుంబ సభ్యులతో పాటు వాళ్ల అమ్మకు కరోనా పరీక్షలు చేస్తున్నారట. ఇప్పటికే బోనీ కపూర్‌ ఇంట్లో పనిచేసే వ్యక్తులకు సైతం కరోనా వైరస్‌ సోకి మళ్లీ ఆరోగ్యంగా ఇంటికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో సినిమాల షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినా అంత తొందరంగా చిత్రీకరించేందుకు ముందుకు రావడం లేదు. అమీర్‌ ఖాన్ ప్రస్తుతం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ అనే చిత్రంలో చేస్తున్నారు. ఇందులో కరీనా కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1994లో హాలీవుడ్‌లో వచ్చిన ‘ఫారెస్ట్ గంప్‌’ చిత్రానికి రీమేక్‌గా వస్తుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.