అమితాబ్‌ బ్లాగ్‌కి పదకొండేళ్లు

బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ సాంకేతికను అందిపుచ్చుకోవడంలో కొత్తతరం నటులకు ఏమాత్రం తీసిపోరు. అభిమానులకు అనేక విషయాలను తెలియజెప్పడంలో బిగ్‌ బి ఎప్పుడూ ముందుంటాడు. అలా తన అనుభాలను, ఆలోచనలను పంచుకునే బ్లాగ్‌ను ప్రారంభించి ఏప్రిల్‌ 17, 2019 తేదీ నాటికి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొంది. ఈ బ్లాగ్‌లో బిగ్‌ బి తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, రాబోయే సినిమాలు తదితర విషయాలను పంచుకుంటుంటారు. అమితాబ్‌ ట్విట్టర్‌ ఖాతాలోనూ చురుగ్గా ఉంటారు. ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుంటారు. బ్లాగ్‌ 11 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా అమితాబ్‌ ట్విట్టర్లో.. ‘‘2008 ఏప్రిల్‌ 17న ప్రారంభమైన ఈ ప్రయాణంలో విరామం, విసుగు లేకుండా ప్రతీ రోజు మీ ప్రేమ పొందినందుకు మీకు నమస్కరిస్తున్నా’’ అంటూ పోస్ట్‌చేశారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.