అమితాబ్‌ చిత్రంపై వివాదం

ఏడు పదుల వయసులో కూడా బుల్లితెర, వెండితెరలపై ఉత్సాహంగా పాల్గొంటున్నారు బిగ్‌బీ. ఈ బాలీవుడ్‌ మెగాస్టార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఝుండ్‌’ వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అవుతుంది. కాని ఈ సినిమా కాఫీరైట్స్‌ నావంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చిన్ని కుమార్‌ మీడియా ముందుకు వచ్చాడు. కుమార్‌ గతంలో నమోదు చేసుకున్న కథను ‘ఝుండ్‌’ బృందం కాపీ కొట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి ఈ చిత్ర దర్శకనిర్మాతలకు నోటీసులు పంపించాడు. వారు దీనిపై ఏ మాత్రం స్పదించకపోవడంతో నిర్మాణ సంస్థకు చెందిన మరికొంత మందికి కూడా నోటిసులు పంపాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.