ఆ చెట్టుతో బిగ్‌ బి అనుబంధం 43 ఏళ్లు


మనం మన ఇళ్లలో మనకు ఇష్టమైన పెట్స్ ని పెంచుకుంటాం. అందులో కుక్కలు, పిల్లులు, ఇంకా చిలకలులాంటివి ఉంటాయి. వీటితో ప్రతిరోజు ఏదో విధంగా అనుబంధాన్ని కలిగి ఉంటాం. అయితే మొక్కలు, చెట్లతోనూ మనిషి అనుబంధం ఉంటుందని కూడా చరిత్రలో విన్నాం. కానీ ఒక చెట్టుతో 43 ఏళ్ల అనుబంధాన్ని కొనసాగించారు బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌. తన ప్రతీక్ష బంగ్లాలో గుల్మోహర్‌ చెట్టును 43 సంవత్సరాల కిత్రం నాటాడు. అయితే అది ఈ మధ్య వచ్చిన వర్షాలకు పడిపోయింది. ఈ సందర్భంగా అమితాబ్‌ ఆ చెట్టుతో అనుబంధం గురించి తన బ్లాగ్‌లో స్పందిస్తూ..‘‘మా ఇంట్లోని ఈ చెట్టు 43 సంవత్సరాలు మా జీవితంలో భాగమైంది. 1976లో ఒక మొక్కగా నాటాం. ఇప్పటి వరకు దాన్ని చుట్టూ ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. హోలి వేడుకలు, మా పిల్లలంతా ఆ చెట్టు చూట్టూ తిరిగి ఆడుకునేవారు. మా మనవరాళ్ల పుట్టినరోజులు, ప్రతి పండగలు, ఉత్సవాలకు అది నిలువెత్తు నిదర్శనం. సత్యనారాయణ వ్రతాలకు, ప్రతి కొత్త ఆనందానికి గుల్మోహర్‌ చెట్టును అందంగా అలంకరించేవాళ్లం. వేసవిలో మా ఇంట్లో అది పూచే పూలను చూసి ఎంతో ఆనందించే వాళ్లం. దాని ప్రకాశవంతమైన నారింజ పువ్వులతో సందడి చేసింది. అలాంటిది ఇప్పుడు స్వచ్ఛందగా ఒరిగిపోయింది. ఈ కష్టాలకు దూరంగా, నిశ్శబ్దంగా..బ్రహ్మాండంగా మరణంలోనూ ఉదారంగా తొలగిపోయిందంటూ..’’పేర్కొన్నారు. అందుకే మనిషికి ప్రకృతికి ఎంతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ప్రతిరోజు మనం నీళ్లు పోసే చెట్టు, మనం దగ్గరకెళ్లగానే అదో ఆనంద అనుభూతిని పొందుతుందని పెద్దలు చెబుతుంటారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.