ఎలా తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారు.

‘అందాజ్‌ అప్నా అప్నా’... ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్‌. అది మంచి కామెడీ చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఆమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ చిత్రం విడుదలై ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు వినయ్‌ సిన్హా, ప్రీతి సిన్హా. ఓ కొత్త తరహా కథనంతో ఈ చిత్రాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది వాళ్ల ఉద్దేశమట. ఈ రీమేక్‌ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌, వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆమీర్‌ ఖాన్‌ను అడిగితే ‘‘ఆ వార్తల్లో నిజానిజాలు నాకూ తెలియదు. కానీ ఆ సినిమాను ఇప్పుడు తీస్తే రణ్‌వీర్‌, వరుణ్‌ చక్కగా సరిపోతారు. అప్పట్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ఆ చిత్రాన్ని రీమేక్‌ చేస్తారో, సీక్వెల్‌ తెరకెక్కిస్తారో తెలియదు గానీ, ఎలా తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అని చెప్పారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.